డి వై ఎస్ ఓ గా ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్

డి వై ఎస్ ఓ గా ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి ఎఫ్ ఎ సిగా జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. రవికుమార్ ని జిల్లా కలెక్టర్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా డి వై ఎస్ ఓ గా నియమించినందుకు కలెక్టర్ ని కలిసి పూల బుక్కెను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడ సంఘాల బాధ్యులను, క్రీడాకారులు అందరి సహాయ సహకారాలు తీసుకొని జిల్లా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.