విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఎమ్మెల్యే లను ఊర్లో తిరుగనీయం

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఎమ్మెల్యే లను ఊర్లో తిరుగనీయం

భువనగిరిలో రాస్తారోకో ఎస్సీ ఎస్టీ బీసీ  సంఘం నాయకులు అరెస్ట్ 

 భువనగిరి ఆగస్టు 28 (ముద్ర న్యూస్) భువనగిరిలో  విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 6000 కోట్ల స్కాలర్షిప్  ఫీజు రియంబర్స్మెంట్  బకాయిలను విడుదల చేయాలని రాస్తారోకో చేస్తుంటే పోలీసులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం నాయకు లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు,బీసీ విద్యార్థిని రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ టీఎస్ సోషలిస్ట్ రాష్ట్ర నాయకుడు కూరెళ్ల మహేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తుంది  అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు, స్కైవర్లకు ఫ్లైఓవర్లకు మిషన్ భగీరథ మిషన్ కాకతీయలకు లక్షల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇస్తానందుకు డబ్బులు లేవని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం సంక్షేమ హాస్టలకు సొంత భవనాలులేవు ఉన్న అద్దె కొంపలకు బెచ్చులూడి విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉన్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుంది.

 ఆర్ కృష్ణన్న కొట్లాడి విద్యార్థుల కోసం పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా పెట్టిస్తే ఆ జీవోను ఈ ప్రభుత్వం తుంగలోకి  రాజకీయంగా ఆర్థికంగా విద్యా పరంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసింది ప్రభుత్వం ప్రకటించిన 115 సీట్లలో 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం సీట్లు కేటాయించడం దుర్మార్గం  ఇక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలి పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలి జనాభా తమాషా ప్రకారం గా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి లేనియెడల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు బస్సులు దహనాలు చేసి ప్రభుత్వని అట్టుడికిస్తామని   హెచ్చరిస్తున్నాం ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శి బైరు  మణికంఠ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన శంకర్,బాలాజీ నాయక్, ఈర్లపల్లి వెంకటేష్, మల్లేష్, సాగర్, రాజ్ కుమార్, సుమలత, విఘ్నేశ్వరి, శ్రీలత, వనిత, తదితరులు పాల్గొన్నారు.