జాతీయ పండుగే గణతంత్ర దినోత్సవం

జాతీయ పండుగే గణతంత్ర దినోత్సవం

జాతీయ పండుగే గణతంత్ర దినోత్సవం’’                        
 `నేడు 73వ గణతంత్ర దినోత్సవం       
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే ‘‘జాతీయ పండుగ’’ దినం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగాభారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడిరది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఛైర్మన్‌ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడిరది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్‌ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.

భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడిరది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.భారతదేశానికి మూడు జాతీయ సెలవు దినాలలో ఇది ఒకటి. మిగతావి స్వాతంత్య్ర దినోత్సవం మరియు గాంధీ జయంతి. ఈ రోజు డిల్లీలో పరేడ్లు నిర్వహిస్తారు. సాహస బాల బాలికలకు భారత రాష్ట్రపతి పురస్కారాలు అందజేస్తారు.భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.జనవరి 26నే ఎందుకు అమల్లోకి తెచ్చారు? 1929లో జవహర్‌ లాల్‌ నెహ్రూ అధ్యక్షతన చారిత్రాత్మక లాహోర్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 1930 జనవరి 26 సంపూర్ణ స్వాతంత్య్రాన్ని దేశం మొత్తం పాటించాలని నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆ రోజును సగర్వంగా పూర్ణస్వరాజ్‌ గా జరుపుకోవడానికి ఏకతాటిపైకి వచ్చారు. అందుకే ఆ రోజును పురస్కరించుకుని రాజ్యాంగాన్ని జనవరి 26నే అమల్లోకి తెచ్చారు.చరిత్ర1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్‌ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు.

1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్య్ర దినో?త్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్య్ర దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.పబ్లిక్‌ డే వేడుకల వేదికరిపబ్లిక్‌ డే వేడుకలు మొదటినుంచి ఇప్పుడు జరుపుకుంటున్నట్టు రాజ్‌ పథ్‌ లో జరగలేదు. 1950 నుంచి 1954 మధ్య వివిధ వేదికల విూద ఈ వేడుకలు జరిగాయి. ఇర్విన్‌ స్టేడియం , కింగ్స్‌ వే , ఎర్ర కోట , రామ్‌ లీల మైదానాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. 1955 నుంచి ఇప్పుడు జరుగుతున్న రాజ్‌ పథ్‌ లో రిపబ్లిక్‌ డే వేడుకల నిర్వహణ మొదలైంది.గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశరాజధాని న్యూఢల్లీిలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్‌ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్‌ చేయిస్తారు.ఇక దేశంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విధంగా ఇందులో పాల్గొనే శకటాల ని చూడ్డం అంటే అఖండ భారతాన్ని ఓ మినియేచర్‌ రూపంలో చూడడమే. ఈ వేడుకలకి ఓ విదేశీ అతిధిని ఆహ్వానించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.2015 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌` సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల ముగింపు ?అందరు అనుకున్నట్టు రిపబ్లిక్‌ డే వేడుకలు జనవరి 26 న మొదలై అదే రోజు ముగిసిపోవు. జనవరి 29 న బీటింగ్‌ రిట్రీట్‌ తో ముగుస్తాయి. రాష్ట్రపతి భవన్‌ రైసినా హిల్స్‌ లో జరిగే ఈ వేడుకలతో రిపబ్లిక్‌ డే వేడుకలు ముగుస్తాయి.