ముత్తారం మండల మానేరులో ఇసుక దొంగలు

ముత్తారం మండల మానేరులో ఇసుక దొంగలు

  • రైతుల పొలల్లో ఇసుక మేటల మాటున ఇసుక అక్రమ రవాణా
  • అర్ధరాత్రి వేళలో హైదరాబాద్ కు జెసిబితో ఇసుక పొసి లారీల్లో  తరలింపు...
  • రాత్రి ఇసుక లారీ దిగబడడంతో బయటపడ్డ బాగోతం...
  • గ్రామస్తుల సమాచారంతో మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు రంగప్రవేశం  జెసిపితో సహా లారీలు సీజ్


ముత్తారం ముద్ర : ముత్తారం మండలంలోని మానేరులో ఇసుక దొంగలు పడ్డారు. ఇంకేముంది రైతుల పొలాల ఇసుక మేటల మాటున పర్మిషన్ తీసుకున్నామని చెప్పి, రాత్రిపూట ఇసుక ను ఏకంగా హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్న ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, ఎస్సై మధుసూదన్ రావు కథనం ప్రకారం ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావు తన పొలంలో ఇసుకమేటులు పోసిందని ఇసుకను తీసేందుకు పర్మిషన్ మైనింగ్ అధికారుల నుంచి తీసుకొచ్చారు. ఆ పర్మిషన్ అయిపోయినప్పటికీ రాత్రి వేలలో అక్రమంగా హైదరాబాద్ నుంచి లారీలను పిలిపించుకొని జెసిపి తో లారీలు నింపి ఇసుకను ఆదివారం రాత్రి తరలిస్తుండగా, లారీ ఒక గుంతలో  దిగబడడంతో ఆ లారీ ఎంతకు బయటికి రాకపోవడంతో తెల్లరింది. దీంతో ఆ లారీ తో పాటు మరో రెండు లారీలు జెసిబిని గుర్తించిన గ్రామానికి చెందిన రైతులు అక్రమ ఇసుక రవాణాను గుర్తించి వెంటనే పోలీసులకు మైనింగ్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉదయం వారు గ్రామానికి హుటాహుటిన  చేరుకొని జెసిబి తో పాటు మూడు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పర్మిషన్ పేరుతో అక్రమంగా ఇసుక ను  తరలిస్తున్న రవీందర్ రావు పై కూడా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. 

మానేరు ఇసుకను హైదరాబాద్ కు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న దళారులు

 గ్రామానికి చెందిన కొంతమంది దళారులు రైతుల పేరుతో మానేరు నుంచి నేరుగా లారీల్లో హైదరాబాదుకు రాత్రి వేళల్లో ఇసుకను తరలించి లక్షల్లో  సంపాదిస్తున్నారు. ఒక్కో లారీకి హైదరాబాదులో రూ. దాదాపు లక్ష కు  పైనే డిమాండ్ ఉండడంతో ఈ ఇసుక రవాణాను ఈజీగా ఎంచుకుంటున్నారు. ఓడేడు గ్రామంలో అక్రమంగా మానేరు పై రోడ్డు పోయగా అటు నుంచి ఈ లారీలను  తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.