ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలుఅభినందనీయం: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలుఅభినందనీయం: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రాయికల్ పట్టణం లో ఇండియన్ రెడ్ క్రాస్‌ సొసైటీ-తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా వృధ్దుల,దివ్యంగుల,ట్రాన్స్ జెండర్ ఆరోగ్య సంరక్షణ కోసం మొబైల్ మెడికేర్ యూనిట్ పేరిట ఉచిత వైద్య చికిత్స, సంచార వాహనం ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంలో భాగంగా రాయికల్ పట్టణంలో ఇందిరా నగర్,వడ్డెర కాలనీ లో ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ వాహనం లో ఎసి సౌకర్యంతో కూడిన 3 చికిత్స అందించే బెడ్ చేర్స్, ఆక్సిజన్ కిట్, రక్త నిధి ఫ్రీజర్ తో కూడిన ఆధునిక వైద్య సౌకర్యాలతో వాహనాన్ని రూపొందించారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. గతంలో తాను రెడ్ క్రాస్ వ్యస్థాపక సభ్యుడిగా, రోటరీ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.కేసిఆర్ గారి ఆలోచన విధానంతో ప్రతి గ్రామంలో,పట్టణంలో పార్కు లు,వైకుంఠ దామలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

వృద్దులకు,దివ్యంగులకు,ట్రాన్స్ జెండర్ ల సౌకర్యార్థం రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మార్గదర్శకంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి మంచాలకృష్ణ, రెడ్ క్రాస్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో  ఉచిత వైద్య సేవలు  అందిస్తున్నారని అన్నారు.జగిత్యాల,రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సౌకర్యాలు పెరిగాయి అని అన్నారు.
ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించు కోవాలని,జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు కంటి వైద్యులు ఉన్నారని వారి సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి ,ఏఎంసి ఛైర్మెన్ రాణి,,కౌన్సిలర్ సాయి, పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి డా.తేజ,మాజీ ఏఎంసి ఛైర్మెన్ ఉదయ శ్రీ,కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.