సన్ సీడ్ హాస్పిటల్ లోప్రత్యేక వైద్య విభాగాలు ప్రారంభం...

సన్ సీడ్ హాస్పిటల్ లోప్రత్యేక వైద్య విభాగాలు ప్రారంభం...

ముద్ర, కుషాయిగూడ: కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలోని సన్ సీడ్ హాస్పిటల్ లో కొత్తగా నెలకొల్పిన చిన్న పిల్లల చికిత్స విభాగం, నేత్ర చికిత్స విభాగం లతో పాటు డయాలసిస్ విభాగాలను బుదవారం ప్రారంభించారు.

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి ల చేతుల మీదుగా వీటికి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుషాయిగూడ పరిసర ప్రాంతాలలో  పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న సన్ సీడ్ హాస్పిటల్  యాజమాన్యాన్ని అభినందించారు. 

ఈ  కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి,హాస్పిటల్  చైర్మన్ డాక్టర్ అన్వేష్ కలుకూరి   మాట్లాడుతూ హాస్పిటల్ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి 100% నార్మల్ డెలివరీ అయ్యేవిధంగా తమ వైద్యులు పనిచేస్తున్నారని అన్ని రకాల పరీక్షలకు 30% డిస్కౌంట్  ఇస్తున్నామని మా సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్  డాక్టర్ భానుచందర్, హాస్పిటల్  డైరెక్టర్ డాక్టర్ తేజస్విని,  హాస్పిటల్ డాక్టర్లు భానుచందర్   డాక్టర్ లావణ్య డాక్టర్ వైష్ణవి  పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఋషి వర్ధన్ రెడ్డి సాహితి రెడ్డి  సీఈఓ కల్కూరి రాములు  హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.