Avinash Reddy anticipatory bail అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Avinash Reddy anticipatory bail అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ వేశారు.    సునీత పిటిషన్​లో కీలకాంశాలు ఉన్నాయి. అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మెరిట్​ ప్రకారం లేవన్నారు.  దర్యాప్తు పూర్తయిన తరువాత విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్​ పిటిషన్​పై విచారణ సందర్భంగా తీసుకోవడం సరికాదన్నారు.  హత్య కేసు దర్యాప్తుపై గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమన్నారు.  ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు.  ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా  సీబీఐ దర్యాప్తు జరిపేలా అనుమతించాలన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రాధాన్యతను పట్టించుకోకుండానే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు.