63 సెగ్మెంట్లు.. 87 సభలు

63 సెగ్మెంట్లు.. 87 సభలు
  • తెలంగాణ ఎన్నికల్లో టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రచారం
  • బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా కౌంటర్​
  • కాంగ్రెస్​ అభ్యర్థులకు దిశానిర్దేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం నిర్వహించిన ఆయన.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మంగళవారం వరకు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. 

అక్టోబర్ 16న తొలి సభ..

అక్టోబర్ 16న వికారాబాద్ లో రేవంత్​తొలి సభ జరగగా.. మంగళవారం మాల్కాజిగిరి రోడ్ షోతో కలపుకొని మొత్తం 87 సభల్లో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పలు సెగ్మెంట్లలో ఆయా అభ్యర్థులతో కలిసి ఓ సారి ప్రచారంలో పాల్గొన్న రేవంత్​ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు ప్రియాంకగాంధీ, రాహుల్​ గాంధీతో కలిసి రెండు, మూడు సార్లు ప్రచారం నిర్వహించారు. ప్రతి సభలో పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అవినీతి, కుటుంబ పాలన, నిరుద్యోగ సమస్యపై విరుచుకుపడ్డ రేవంత్​ సీఎం కేసీఆర్​, కేటీఆర్​తో సహా మంత్రులందరినీ టార్గెట్​గా చేసుకుని విమర్శలు గుప్పించారు. అలాగే  బీజేపీ, ఎంఐఎం పార్టీల తెరచాటు స్నేహాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన ఆయన.. ఎంఐఎం అధినేత ఒవైసీ పట్ల ముస్లిం ఓటర్లలో ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్​ ప్రకటించిన డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు, మెనిఫెస్టో అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించిన రేవంత్.. గెలుపు అంశాలపై​ కాంగ్రెస్​ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.