అచ్చంపేట నల్లమల ప్రజలను లిఫ్టుల పేరుతో రైతులను మరో మారు మోసం

అచ్చంపేట నల్లమల ప్రజలను  లిఫ్టుల పేరుతో రైతులను మరో మారు మోసం
  • డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

ముద్ర,అచ్చంపేట:-అచ్చంపేట నల్లమల ప్రజలను,రైతు లను లిఫ్టుల పేరుతో రైతులను మరో మారు మోసం చేస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. ఆదివారం లింగోటం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017లో మంత్రి హరీష్ రావు అమ్రాబాద్ మండలానికి వచ్చి రైతులకు సాగునీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆరు సంవత్సరాలు కావస్తున్న ఆయన మాటలు నీటి మూటలు గాని మిగిలిపోయాయని మరో మారు 2018 ఎన్నికల్లో అమ్రాబాద్ బల్మూరు మండలానికి సాగునీరు అందించే దిశగా 200 కోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ చెన్నకేశవ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పిన విషయం తెలిసిందేనని 2021 మున్సిపల్ ఎన్నికల్లో ప్రాజెక్టు పనులు మొదలు పెడుతున్నామని చెప్పి ఎక్కడ పనులు మొదలుపెట్టిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. ఉన్నట్టుండి కొత్తగా ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ చెన్నకేశవ లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా మరో కొత్త రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రావడంపై ఆంతరమేమిటో చెప్పాలన్నారు.

నిరంజన్ షావలి లిఫ్ట్ ఇరిగేషన్ మద్దిమడుగు ఆంజనేయస్వామి లిఫ్ట్ ఇరిగేషన్ అని రైతులను మరో మారు మోసం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆడుతున్న కొత్త నాటకం అని ఆయన అన్నారు. నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన జీవో కాపీలను ప్రజల ముందు ఉంచాలని ఆయన మాట్లాడారు. క్యాబినెట్లో లిఫ్టులపై ఆమోదం తెలపడం జరిగిందని 1500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి నియోజకవర్గంలో 2 లక్షల పైగా పోస్టర్లు అందించడమే తప్ప చేసింది ఏం లేదన్నారు. అభివృద్ధి అంటే సిసి రోడ్లు డ్రైనేజీలు కట్టడం కాదని ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా పాలన ఉండాలని ఆయన అన్నారు. 10 సంవత్సరాలలో చిన్న చిన్న చెరువులకు తూములు సరి చేయలేని ఈ ఎమ్మెల్యే లిఫ్టురిగేషన్ ప్రాజెక్టులు ఎలా సాధ్యమని మండిపడ్డారు. ప్రాజెక్టు కట్టాలి అంటే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్  నుండి ఆమోద పత్రం రావాలని సూచించారు. అలాంటిది ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఇది ఎన్నికల ముందు కొత్తడ్రామా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నరసయ్య యాదవ్ కట్ట అనంతరెడ్డి రాజేందర్ రామనాథం,కొయ్యల శ్రీనివాస్,శేఖర్,పవన్,అంజి,తదితరులు పాల్గొన్నారు.