కళంకిత సీబీఐ ని ప్రక్షాళన కోసం

కళంకిత సీబీఐ ని ప్రక్షాళన కోసం
  •  కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్
  • జె ఎస్ ఆర్ డిమాండ్
  • సిబిఐ ప్రజలకు జవాబుదారి సంస్థగా ఉండాలనీ ప్రజా ఉద్యమకారుడు జెఎస్ఆర్ విజ్ఞప్తి


ఊరంతటికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా ఉంది కేంద్ర దర్యాప్త సంస్థ(కేదస-సీబీఐ) పరిస్థితి అవినీతి గ్రంథసాంగులకు సింహస్వప్నం కావాల్సిన ఆ సంస్థలోనే కొంతమంది కట్టుతప్పుతున్నారు. కంచే చేనును మేసినట్లు అక్రమార్క అవతారాలెత్తుతున్నారు. బ్యాంకు మోసం కేసులో నిందితులతో కుమ్మక్కయ్యారన్న అభియోగాలతో 'కేదస'లోని డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులిద్దరు రెండేళ్ల క్రితం అరెస్టయ్యారు. చండీగఢ్ వ్యాపారవేత్తను బెదిరించిన ఉదంతంలో నిరుడు నలుగురు సీబీఐ సబన్స్పెక్టర్లు పట్టుబడ్డారు. 'పాతిక లక్షల రూపాయలు ఇస్తావా... ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నావని కేసు పెట్టమంటావా' అంటూ వారు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు కథనాలు వెలువడ్డాయి. వెలుగుచూసిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక ప్రకారం- సీబీఐకి చెందిన గ్రూప్-ఏ అధికారులపై మొత్తం 52 కేసులు పెండింగ్లో ఉన్నాయి. గ్రూప్-బీ, సీ సిబ్బందిపై నమోదైన మరో పందొమ్మిది కేసులూ. అలాగే అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. సీవీసీ నివేదించినట్లు- భారతదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ పేరుప్రతిష్ఠలకు అవి కళంకాలవుతున్నాయనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇంటిదొంగలతో పరువు మాయడమే కాదు- అనేక సంచలనాత్మక కేసుల్లో న్యాయసమీక్షా ప్రమాణాలను అందుకోవడంలోనూ సీబీఐ చేతులెత్తేస్తోంది. తన యజమానులు పాటపాడే పంజరంలో చిలుకగా కేదసను సర్వోన్నత న్యాయస్థానమే గతంలో ఛీత్కరించింది. సీబీఐ చేతలను అనేక సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టిన న్యాయపాలిక ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేల్చారో చెప్పండనీ నిగ్గదీసింది. కార్యశీలత, నిష్పక్షపాతం, నిజాయతీలే సహజాభరణాలుగా రాజిల్లాల్సిన సీబీఐ- అందుకు భిన్నమైన పనితీరుతో ప్రజల్లో విశ్వసనీయతను ఏనాడో పోగొట్టుకుందనీ ప్రజాస్వామిక ఉద్యమకారుడు కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ ధ్యేయమేమిటి? లోతైన దర్యాప్తు, విజయవంతమైన విచారణ భారత రాజ్యాంగాన్ని, చట్టాలను నిలబెట్టడం' అని అధికారిక వెబ్సైట్లో ఆ సంస్థే స్వయంగా సెలవిస్తోంది. ఆచరణలో మాత్రం... ముఖ్యంగా నేతలే నిందితులుగా ఉండే కేసుల్లో దాని దర్యాప్తులు అష్టవంకర్లు తిరుగుతూ ఒకపట్టాన తెమలవన్నది యావద్దేశానికీ తెలిసిన విషయమేన నీ ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు రాసిన బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధుల అవినీతి వ్యవహారాల కేసుల్లో పది పదిహేనేళ్లు దాటిపోతున్నా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడమేమిటి అని సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టే గతంలో తీవ్ర అసహనం వ్యక్తంచేసిందనీ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ బాధను వ్యక్తం చేశారు.  యూరియా కుంభకోణంపై నివేదిక సమర్పణలో ఏకంగా 22 ఏళ్లు ఆలస్యం చేసిన సీబీఐ. వ్యవహారశైలి - దిల్లీ ప్రత్యేక న్యాయస్థానాన్ని నిరుడు చిర్రెత్తించింది. 2022 డిసెంబరు చివరి నాటికి సీబీఐ చేపట్టిన 6841 అవినీతి కేసుల్లో విచారణలు పెండింగ్లో పడిఉన్నట్లు సీవీసీ నివేదిక వెల్లడిస్తోంది. వాటిలో 2039 కేసులు. పదేళ్ల కిందటివైతే- రెండు దశాబ్దాలకు పైబడి దేకుతున్నవి మూడువందలకు దేశీయంగా అవినీతి పైగా ఉన్నాయనీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

 ఏళ్లూపూళ్లూ సాగుతున్న విచారణలు- చట్టాన్ని నిరుపయోగం చేస్తున్నాయి. జాతివనరుల స్వాహాయణాల కేసులు వేగంగా కొలిక్కి రాకపోతుండటం- నేరచరిత నేతలూ అవినీతి గల స్వైరవిహారానికి కారణమవుతోందనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జెఎస్ఆర్ 9848540078 తెలిపారు. భ్రష్టాచారాలపై సీబీఐ నిజంగానే బ్రహ్మాస్త్రం కావాలంటే అందులో భారీగా పోగుపడిన ఖాళీలను కేంద్రం వెంటనే భర్తీచేయాలి. ఎవరి ఒత్తిళ్లకూ లొంగని స్వతంత్ర సంస్థగా కార్యనిర్వాహక స్వయంప్రతిపత్తితో 'కేదస' పనిచేయాలనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ డిమాండ్ చేశారు. అందుకుగాను 'సుప్రీమ్' ఏనాడో ఆశించినట్లు- ప్రత్యేక శాసన నిర్మాణం సాకారం కావాలనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు. సీబీఐ స్థాపనా లక్ష్యాలు నెరవేరాలంటే పార్లమెంటుకు, తద్వారా ప్రజలకు అది జవాబుదారీ అయ్యి తీరాలనీ బాధితుల బంధువు ప్రజాతంత్ర ఉద్యమకారుడు సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ 8328277285 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలలో కోరారు.