తెలంగాణ చౌక్ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి శ్రేణులు

తెలంగాణ చౌక్ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి శ్రేణులు

లిక్కర్ దందా , ఈడి కేసుల దృష్టి మరల్చడానికి  ప్రగతి భవన్ డైరెక్షన్లో బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు 

తెలంగాణ యాస, భాషను కూడా జీర్ణించుకోలేనిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు 

మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాల పై ఇన్నేళ్లు కెసిఆర్ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఎందుకు స్పందించలేదు..?

 కెసిఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా, ఈడీ కేసుల  దృష్టిని మరల్చడానికి ప్రగతి భవన్ డైరెక్షన్లో బిఆర్ఎస్ పార్టీ  చిల్లర,పనికిమాలిన రాజకీయం చేస్తుందని ,ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడంలో తెలంగాణ భాష యాస పాత్ర , ప్రాధాన్యత మరిచి, కన్నతల్లిలాంటి సొంత భాషనే మర్చిపోయేంత అహంకారం తో కెసిఆర్ కుటుంబం ,బిఆర్ఎస్ శ్రేణులు వ్యవహరిస్తున్నారని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్ తెలంగాణ యాసలో మాట్లాడే భాషను వక్రీకరించి  ఏదో మహిళా జాతినే  అవమానించినట్టు చిత్రీకరిస్తూ  ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని బిజెపి శ్రేణులు మండిపడ్డారు. బిఆర్ఎస్ శ్రేణులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ బిజెపి శ్రేణులు ఆదివారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి  కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూలిక్కర్ దందాలో ఇరికిన వాళ్లని  జైలుకి పంపకుండా ముద్దు పెట్టుకుంటారా అని  బండి సంజయ్   యాదృచ్ఛికంగా మాట్లాడితే బిఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర గవర్నర్ పైనే అనుచిత వ్యాఖ్యలు,అధికార పార్టీ సర్పంచి విషయంలో అసభ్యకరంగా  ప్రవర్తించే విధంగా బిఆర్ఎస్ పార్టీ ఉండి. ,  సహజంగా మాట్లాడే వ్యాఖ్యలను  భూతద్దంలో చూపిస్తూ  పనికిమాలిన రాజకీయం చేస్తుందన్నారు.

రాష్ట్రంలో గ్రామం నుంచి హైదరాబాదు లాంటి మహానగరం వరకు ప్రతిరోజు మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని. అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్న బిఆర్ఎస్ఏ నాడు స్పందించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురే ఈడి విచారణ ఎదుర్కోవడం తమ పార్టీ పరువు  పోతుందని తెలిసి విషయాన్ని పక్కదారి పట్టించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం రాజకీయ నాటకాలు ప్రదర్శించిందని ఎద్దేవ చేశారు.మహిళలపై నిజమైన గౌరవం ఉంటే గతంలో జరిగిన అనేక ఘటనలపై కెసిఆర్  ప్రభుత్వం  వ్యవహరించిన తీరు ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు.  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు లైంగిక వేధింపులు , మహిళా రిజర్వేషన్ బిల్లు లు ఇన్నేళ్లకు బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ కవితకు గుర్తుకు వచ్చాయా ? అని ప్రశ్నించారు.

లిక్కర్ దందాలలో ఇరుక్కుపోయిన కుమార్తె ,ఎమ్మెల్సీ కవిత ను రక్షించడానికి కెసిఆర్  పడరాని పాట్లు పడుతున్నారని, ఆయన కుటుంబ సమస్యను తెలంగాణ సమాజంపై రుద్దడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ కుట్రలు, కుతంత్రాలను, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరిటాల శివరామయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు కళ్లెం వాజ్జీవరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ , బిజెపి మీడియా కన్వీనర్ కటకంలోకేష్, జాడి బాల్ రెడ్డి బిజెపి జిల్లా నాయకులు పుప్పాల రఘు, బండ రమణారెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, మామిడాల చైతన్య రమేష్, వరాల జ్యోతి, సుధాకర్ పటేల్ ,మంతెన కిరణ్, తణుకు సాయి, అక్షయ్, రాము, హరి, అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు..