Telangana Inter Results - తెలంగాణ ఇంటర్ ఫలితాలపై లేటెస్ట్‌ అప్డేట్...

Telangana Inter Results - తెలంగాణ ఇంటర్ ఫలితాలపై లేటెస్ట్‌ అప్డేట్...

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం లక్షలాది విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తైనప్పటికీ ఫలితాల విడుదలపై ఇంటర్‌ బోర్డు అధికారిక ప్రకటన వెలువరించలేదు. అయితే ఏప్రిల్‌ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తి అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి ఇస్తే ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఒకేసారి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువరించానున్నారు.అయితే ఈ ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన ప్రకటించేందుకు ప్రాథమికంగా ఓ తేదీని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ తేదీ కుదరకపోతే ఏప్రిల్ 25లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.