కొండగట్టులో టెండర్లు వాయిదా

కొండగట్టులో టెండర్లు వాయిదా
  • 14 వ్యాపారాలకు 11 వాటికి డీడీలు
  • నిబంధనలు పాటించలేదని వాయిదా
  • కుమ్మక్కుకు ప్రయత్నం చేసుకున్న పలువురు వ్యాపారులు..?

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో పలు వ్యాపారాల నిర్వహణకు గురువారం చేపట్టిన టెండర్ల ప్రక్రియ వాయిదా వేసినట్లు ఆలయ ఈఓ వెంకటేష్ తెలిపారు. ఏడాది కాలపరిమితితో మొత్తం 14 వ్యాపారాలకు టెండర్లు నిర్వహించడానికి ఆలయ అధికారులు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ రోజు 11వాటికి మాత్రమే డీడీలు వచ్చినట్లు, వారు కూడా ప్రకటన నిబంధనలు సరిగా పాటించనoదున, పలువురి అభ్యంతరాల మేరకు వాయిదా వేసినట్లు, మళ్ళీ ఈ నెల 16 న టెండర్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఈఓ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, పొలాస పౌలస్తేశ్వర ఆలయ ఈవో వేణుగోపాల్, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, పౌండర్ ట్రస్ట్ చైర్మన్ టి. మారుతి, సూపరిoడేoట్ సునీల్, మాజీ పాలకమండలి సభ్యులు పోచమల్ల ప్రవీణ్, ఆలయ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా, టెండర్లు వాయిదా పడవనే ఉద్దేశంతో పలువురు వ్యాపారులు ముందే కుమ్మకై టెండర్లు దక్కించుకునే ప్రయత్నం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, పాత దుకాణాలకు సంబందించిన జీఎస్టీ అమౌంట్ ఇంకా చెల్లించక పోవడంపై కూడా పలువురు ఈవోని ప్రశ్నించినట్లు సమాచారం.