అదనపు బ్యాలెట్ యూనిట్ ల మొదటి దశ పరిశీలన పూర్తి 

అదనపు బ్యాలెట్ యూనిట్ ల మొదటి దశ పరిశీలన పూర్తి 
  • ఈవిఎం గోదాంలో బ్యాలెట్ యూనిట్లను పరిశీలించినలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాకు వచ్చిన 624 అదనపు బ్యాలెట్ యూనిట్ ల మొదటి దశ పరిశీలన పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవిఎం గోదాంలో ఈవిఎం యంత్రాలను కలెక్టర్, సోమవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించారు. జిల్లాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల  నేపథ్యంలో వినియోగించే బ్యాలెట్ యూనిట్ లను కలెక్టర్ పరిశీలించి, అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగించడం జరుగుతుందని అన్నారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అదనపు బ్యాలెట్ యూనిట్ వినియోగిస్తున్న నేపథ్యంలో జిల్లాకు 624 అదనపు బ్యాలెట్ యూనిట్ లు వచ్చాయని అన్నారు. జిల్లాకు కేటాయించిన అదనపు బ్యాలెట్ యూనిట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, తహసిల్దార్ రాజ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, వివిధ రాజకీయ పార్టీలప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.