భారత వ్యవసాయ రంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు మరువలేనివి 

భారత వ్యవసాయ రంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు మరువలేనివి 
  • దేశం అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కావాలి. 
  • విత్తన రంగంలో నిరంతరం పరిశోధనలు జరగాలి.
  • కేరళ తరహాలో కింటాకు 700 రూపాయలు బోనస్ ఇవ్వాలి.
  • ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారక సెమినార్ లో అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సేవలు మరువలేనివని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారకార్థం" భారత వ్యవసాయ రంగం - స్వామినాథన్ సిఫారసులు"  అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2014, 2018ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో  స్వామినాథన్ సిఫారసులను దేశంలో అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.  స్వామినాథన్  దేశంలో ఉన్న రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేశారని అన్నారు. చేసిన పరిశోధనలకు గాను  అవార్డులు వచ్చాయన్నారు.దేశం అభివృద్ధి కావాలంటేవ్యవసాయం అభివృద్ధి కావాలని అప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని అన్నారని అన్నారు. రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని అనేక సిఫారసులు చేశారని అన్నారు. దేశంలో ఉన్న మహిళా రైతుల అభ్యున్నతి కోసం కుటుంబ స్త్రీ పథకం అమలు చేయాలని స్వామినాథన్ సిఫారసు చేశారని అన్నారు. వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించాలని స్వామినాథన్ సూచించారని అన్నారు. విత్తన ఏర్పాటు సంస్థగా భారతదేశం అభివృద్ధి కావాలని నిరంతరం ఆకాంక్షించారని  అన్నారు. విత్తన రంగంలో వస్తున్న మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిశోధనలు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో 1991 నుండి పీవీ నరసింహారావు, 1994 నుండి డెంకల్ లు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రతిపాదనల వల్ల దేశంలో సంస్కరణలు వేగవంతం అయ్యాయని  దాని మూలంగా రైతాంగం అనేక సబ్సిడీలను కోల్పోయిందన్నారు. ప్రతి కుటుంబానికి53 ఎకరాల భూమికన్నా ఎక్కువగా ఉండకూడదని చట్టం చెబుతుంటే పాలకులు ట్రస్టులపేరుతో వేలాది ఎకరాల భూములను తమ గుప్పెట్లో ఉంచుకొని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలుచేసి భూమిలేని పేదలందరికీ  ఒక ఎకరం భూమి ఇవ్వాలని సిఫారసు చేశారని అన్నారు. ఆ సిఫారసులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కయని విమర్శించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా దేశంలో అనేక మంది రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 వేలమంది రైతులు ఈ సంవత్సరంలో చనిపోయారని అన్నారు. ఇందులో 6000 మంది రైతులు  ఆత్మహత్య చేసుకున్నారని, 700 మంది రైతులు విద్యుత్ ప్రమాదం మూలంగా చనిపోయారని అన్నారు. మిగతా రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక తెచ్చిన అప్పులు తీరక చనిపోయారని అన్నారు. రైతంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం  చెందాయని విమర్శించారు. సిపిఎం పార్టీ నేతృత్వంలోనికేరళ వామపక్ష ప్రభుత్వం మద్దతు ధర తో పాటు 700 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తుందన్నారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతుబంధు వర్తింపజేయాలని  డిమాండ్ చేశారు.

రైతాంగం తీసుకున్న అన్ని రకాల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోను కుంటున్నాయని రానున్న ఎన్నికల్లో రైతాంగం బిజెపి, బి ఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మరణాన్ని చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభనాయక్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, వివిధ ప్రజాసంఘాల నాయకులు జిల్లపల్లి  నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకనబోయిన సైదమ్మ, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మడ్డి అంజిబాబు,కొప్పుల రజిత, దేవరం వెంకటరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం,కాసాని కిషోర్, కందాల శంకర్ రెడ్డి, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మేకనబోయిన శేఖర్ , స్టాలిన్ రెడ్డి, వజ్జా శ్రీనివాస్, పోషణ పోయిన హుస్సేన్, అవిరే అప్పయ్య, చిన్నపoగా నరసయ్య, ఎం. రాంబాబు, పులుసు సత్యం, చందా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.