ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదు

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదు
  • నెమ్మాది వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్క్కరించే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు..శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రం లోని పి ఎస్ ఆర్ సెంటర్ లో ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.ఈ రాస్తోరోకో ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నె మ్మాది వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి లు మాట్లాడా రు.ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఆశా వర్కర్లకు పని ఎక్కువ, జీతం తక్కువ అని నె మ్మాది తెలిపారు.
సకల జనులు ఎంతో పోరాటం చేసి సాధించిన తెలంగాణ లో సకల జనులు తిరిగి మళ్ళీ పోరాటం లోకి రావాలని నె మ్మాది కోరారు.జిల్లా కేంద్రం లో 7వ తేదీన నిరసన కార్యక్రమాలు ఉంటాయని అందులో ప్రతి కార్యకర్త పాల్గొనాలని నెమ్మాది కోరారు.ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి ,పుష్ప, ఉమా,మేరమ్మ, సైదమ్మ, అమల, సంధ్య, ఉపేంద్ర,సబితా, మున్నీ, సుమతి, సంతోష, తదితరులు పాల్గొన్నారు