సంస్కారం, విద్యను అందించే వారు గురువులు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

సంస్కారం, విద్యను అందించే వారు గురువులు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : అమ్మానాన్నలు జన్మనిస్తే సంస్కారం, విద్యను నేర్పించేవారు గురువులని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మహారాష్ట్ర భిమండిలో తాను చదువుకున్న పీఈఎం హై స్కూల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ తన కూతురుగా ఆదరించి విద్య నేర్పిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదని సమాజంలో ఆడపిల్లలను చిన్నచూపు చూస్తున్న ఈ తరుణంలో మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మనకు ఏ రంగంలో అయితే అవకాశాలు వస్తే ఆ రంగంలో దూసుకుపోవాలన్నారు.

అన్నిట్లో సగం ఉన్న మనం ప్రతి ఒక మహిళ ఇంట్లో కూర్చుని సమయం వృధా చేసుకోకూడదని ఆడపిల్ల చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్న మీకు ఏ అవకాశం వచ్చినా అది రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగం ఎదయిన రాణించాలని అన్నారు. మహిళల పట్ల వివక్ష చూపకుండా గురువులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. భిమండికి చెందిన చైర్ పర్సన్ జ్యోతిని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నిక అయిన సందర్భంగా అక్కడి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలవాలని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ లు మహారాష్ట్రలోని శని సింగపూర్, షిరిడి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.