జవహర్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం....

జవహర్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం....
  • ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దు...మంత్రి కే టీ ఆర్
  • రూ.250 కోట్లతో డంపింగ్ యార్డు లో కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ ప్రారంభం...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: పేద,మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న జవహర్ నగర్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్త శుద్ధి తో కృషి చేస్తుందని, ప్రతి పక్ష పార్టీ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దని రాష్ట్ర పురపాలక, ఐ టీ శాఖ మంత్రి కే టీ రామారావు సూచించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు లో సుమారు రూ. 250 కోట్ల వ్యయం తో ఏర్పాటు చేస్తున్న కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి ప్లాంటును శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం 58 జీ ఓ కింద 3619 మంది పేద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ గత 50 ఏళ్లు అధికారం లో ఉన్న ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనుల ను తాము కొద్ధి కాలం లోనే చేసి చూపించామని తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇక్కడి పేద ప్రజలు ఇంత కాలం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని మంత్రి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మాత్రం జవహర్ నగర్ అభివృద్ధి కోసం చిత్త శద్ధితో కృషి చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ అమొయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ శంబిపుర్ రాజు తదితరులు పాల్గొన్నారు.