పరేడ్‌ లో స్త్రీ శక్తి

పరేడ్‌ లో స్త్రీ శక్తి

 గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో మహిళా శక్తి మెరిసింది. ఢల్లీిలో జరిగిన వేడుకల్లో మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంది. జనవరి 26వ తేదీన నిర్వహించే పరేడ్‌ లో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట, పాటలతో అద్భుతంగా సాగింది. అయితే ఈశారి ‘‘మన శక్తి’’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ఈ పరేడ్‌ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలించింది. పరేడ్‌ లో పాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. కానీ ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వం స్థానం దొరికింది. నావికా దళంలో నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ గా పని చేస్తున్న 29 ఏళ్ల లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌.. 144 మంది నావికులతో కూడి కవాతు బృందానికి నాయకత్వం వహించారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో మిగ్‌`17 పైలట్‌ గా ఉన్న స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా ఆకాశ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ కు లెఫ్టినెంట్‌ ఆకాశ్‌ శర్మ నాయకత్వం వహించారు. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్‌ డిరపుల్‌ భాటి మోటార్‌ సైకిల్‌ విన్యాసాల దళంలో మేజర్‌ మహిమ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌ మెంట్‌ బృందాల నాయకత్వంలో పాల్గొన్నారు.రాజధానిలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర పరేడ్‌ కూడా బాగా జరిగింది.

సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు.పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల  కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్‌ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది.

ఎన్‌సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో మిగ్‌? 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్‌ ఇన్‌ ఇండియా ఆకాశ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్‌ ఆకాష్‌ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్‌ డిరపుల్‌ భాటి మోటార్‌ సైకిల్‌ విన్యాసాల దళంలో, మేజర్‌ మహిమ ‘కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు.పశ్చిమ బెంగాల్‌ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్‌ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది.

కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్‌ దారుల్లో నడిపించనున్నాయి. ఈ వేడుకల్లో ప్రాంతాలకు తగ్గట్లుగా సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతోపాటు మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రబల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ముందు ఎద్దుల బండి, వెనుక సంక్రాంతి పండుగను చాటేలా అలంకరించారు. అలాగే గుజరాత్‌, అసోం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడిపాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికి పాటుపడతాం అనే థీమ్‌ తో త్రిపుర శకటం ఉంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ స్త్రీతత్వం థీమ్‌ తో శకటాలను నడపింది.