గోల్డ్ స్మిత్ ఇంట్లో ఏసీబీ సోదాలు
![గోల్డ్ స్మిత్ ఇంట్లో ఏసీబీ సోదాలు](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_651503e538c24.jpg)
- ఎల్లారెడ్డిపేటలో సిద్దిపేట జిల్లా ఎసిబి తనిఖీలు
- గణపతి నిమజ్జనం రోజు చర్చనీయాంశం
ముద్ర,ఎల్లారెడ్డిపేట: గోల్డ్ స్మిత్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్నోజు పురుషోత్తమ చారి ఇంట్లో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పురుషోత్తమ చారి బంగారు నగల తయారీ వృత్తిలో గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎల్లారెడ్డిపేట శాఖలో బంగారం అప్రైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బంగారం విషయంలో ఏసీబీ అధికారులు పురుషోత్తమ చారి ఇంట్లో తనిఖీలు నిర్వహించడానికి వచ్చిన సమయంలో సదరు వ్యక్తి వ్యక్తిగత పనులపై మరో ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం వినాయక నిమజ్జనం రోజు ఏసీబీ అధికారులు ఎల్లారెడ్డిపేటలో రంగ ప్రవేశం చేయడంతో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.