తాటిచెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి .. ఎక్సైజ్ సూపరిండెంటుకు పిర్యాదు

తాటిచెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి .. ఎక్సైజ్ సూపరిండెంటుకు పిర్యాదు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లిలో తాటి చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు బాల్నె వెంకటమల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణ ప్రియని కలిసి చెట్లను నరికిన వారిపై చర్య తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ  శివునిపళ్లిలోని సర్వేనెంబర్ 62 లో వేముల దృవతేజ, వేముల రమాదేవి, అప్పలరాజుల సంధ్యారాణి లు కల్లు పారే తాటి చెట్లను జేసిబితో తొలగించరని అన్నారు. ఈ విషయంపై గత నెల 20 న ఎక్సైజ్ సీఐకి, 31 న జనగామ ఎక్సైజ్ సూపరిండెంటుకి పిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు అన్నారు. తాటి చెట్లు నరకడం తో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, గీతా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో కార్మికులు వంగ శ్రీనివాస్, వంగ సురేష్, వంగ వేణు, తిరుపతి, నారాయణ, కుమారస్వామి, ఎల్లా గౌడ్, కూనూరు ఎల్లా గౌడ్, పల్లె అశోక్, పల్లె మహేందర్, వంగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు