బ్రేకింగ్ న్యూస్ - జనసేన పార్టీకి బిగ్‌షాక్‌

బ్రేకింగ్ న్యూస్ - జనసేన పార్టీకి బిగ్‌షాక్‌

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ముఖ్యనేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు , పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో మహేశ్ పేర్కొన్నారు.