నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

ముద్ర,తెలంగాణ:- ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున.. ముఖ్యంగా తన చిన్న కుమారుడుకి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకిస్తోంది. ఇరువైపు వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఆమె అభ్యర్థనను పక్కనబెట్టింది.