తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అగ్ని కణం చాకలి ఐలమ్మ 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అగ్ని కణం చాకలి ఐలమ్మ 

ముద్ర, రాయికల్ : భూమి,భుక్తి,వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణరైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చిట్యాల ఐలమ్మ. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడ పడుచు వేల ఎకరాల అధిపతైన దొర దోపిడీని ఎదిరించి నిలిచింది. ‘దున్నేవాడిదే భూమి’ అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ నిప్పురవ్వ అని చాకలి ఐలమ్మ 38 వర్థంతి సందర్భంగా రాయికల్ పట్టణంలో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించండం జరిగింది.

ఇట్టి కార్యక్రమం రాయికల్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాల్గవవార్డు కౌన్సిలర్ తురగ శ్రీధర్, రజక సంఘం సభ్యులు భూమయ్య ,గంగాధర్ , రాజు, రాజo , శ్రీనివాస్. నాగరాజు, రాయికల్ పట్టణ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.