పోలింగ్ కేంద్రాలలో కనీస వసతుల పరిశీలన కై కమిటీలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రావు

పోలింగ్ కేంద్రాలలో కనీస వసతుల పరిశీలన కై కమిటీలు ఏర్పాటు  జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ లో భాగంగా నియోజక వర్గాల వారీగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు పరిశీలించుటకు    నియోజక వర్గానికి 4 టీంలు చొప్పున ఏర్పాటు చేయనైనదని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట నియోజక  వర్గానికి జెడ్పి సి.ఈ.ఓ , డి. ఈ. పి.ఆర్. మిషన్ భగీరథ డి.ఈ లతో పాటు సంబంధిత మండలాల విద్యుత్ శాఖ  ఏ. ఈ లు  ఉంటారని తెలిపారు. అలాగే కోదాడ  నియోజక వర్గానికి సంబంధించి వ్యవసాయ శాఖ డి.ఏ.ఓ , పి.ఆర్. డి.ఈ. , మిషన్ భగీరథ ఇంట్రా సంబంధిత మండలాల ఏ. ఈ లు ఉంటారని  అదేవిదంగా హుజూర్ నగర్ నియోజక వర్గానికి  డి.పి.ఓ, పి.ఆర్. డి.ఈ, మిషన్ భగీరథ ఇంట్రా తో పాటు సంబంధిత మండలాల విద్యుత్ ఏ. ఈ లు  పాల్గొంటారని అలాగే తుంగతుర్తి నియోజక వర్గానికి డిఆర్డీఓ , పి.ఆర్. డి.ఈ, డి.ఈ ఇంట్రా అలాగే  సంబంధిత మండలాల విద్యుత్ శాఖల ఏ. ఈ లు కనీస వసతులు పరిశీలన చేసి నివేదికలు  అందచేయాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

బ్యాంకు లావాదేవీల వివరాలు అందజేయాలి

బ్యాంకు లావాదేవీల  వివరాలు అందజేయాలని  జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు తెలిపారు.ఒకే వ్యక్తి నుండి ఎక్కువ ఖాతాలకు లావాదేవీలు జరిగినట్లయితే ఎల్ డి ఎం బాపుజి కు వివరాలు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకులలో ఐదు లక్షల కంటే పైన జరిగిన లావాదేవీల వివరాలు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. అలాగే నెట్ బ్యాంకింగ్ లో జరిగే లావాదేవీల పైన కూడా పరిశీలన చేయాలని  పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఎ జిఎం జ్యోతి ,చెస్ట్ బ్యాంక్ మేనేజర్ద దినేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్, ఏపీజీవీబీ మేనేజర్ వసీమ్ ఆక్రం వివిధ బ్యాంకుల మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు.

పులిశెట్టి మనీష్ కు రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు సం 2024 సందర్భంగా సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల కు చెందిన పులిశెట్టి మనీష్ కు    బాల పురస్కార్ అవార్డు కొరకు సైన్స్  టెక్నాలజీ విభాగం కింద దరఖాస్తు చేసుకొని  ఉన్నారని  జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు.

  పోలిశెట్టి మనీష్ నామినేషన్  అప్లికేషన్ ను  పరిశీలించి  ఆమోదం తెలపడం జరిగిందని , అభ్యర్థి యొక్క   దరఖాస్తును  పి.ఎం కేర్ ప్రోటల్ అంతర్జాలంలో ఆమోదించడం తో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్  మనీష్ కు  అవార్డు లభించే విదంగా  ప్రోత్సహించిన మనీష్  తల్లిదండ్రులను కూడా ఈ సందర్బంగా  కలేక్టర్ అభినందించారు.