ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక.. సిరి పంగి లింగస్వామి

ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక.. సిరి పంగి లింగస్వామి

మండల వాసికి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎన్నిక

ముద్ర,చివ్వెంల: చివ్వెంల మండల పరిధిలోని కాసింపేట గ్రామానికి చెందిన సిరిపంగి లింగస్వామి మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బుధవారం  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ భవనంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించినారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపంగి లింగస్వామి మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లాలో ఎమ్మార్పీఎస్ బలపేతం చేస్తానని, మాదిగల దండోరా ఉద్యమం మాదిగల హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మార్పీస్ నాయకులకు జిల్లా, రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూరగంటి అంజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇన్చార్జి ముక్కలపల్లి రవి, రాజన్న , అధ్యక్షులు చింత వినయ్ బాబు, ఏపూరి సత్యరాజ్, మాదాస్ గోపి, నందిగామ వినోద్ కుమార్, పాల్వాయి పరశురాములు, బొడ్డు విజయ్ కుమారి, చెడుపాక గంగరాజు, శ్రీను రాజు, తదితరులు ఉన్నారు.