సూర్యాపేట ఇన్చార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

సూర్యాపేట ఇన్చార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా మేక నాగేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న మేక నాగేశ్వరరావు ఎస్పి  రాజేంద్రప్రసాద్ బదిలీ కావడంతో ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్పి రాజేంద్రప్రసాద్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన మేక నాగేశ్వరరావు సిఐగా, డీఎస్పీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ ఉద్యోగ ఉన్నతి పై ఇటీవల సూర్యాపేట జిల్లాకు అదనపు ఎస్పీగా రావడం జరిగింది. తన తోటి అధికారులు సిబ్బంది, ప్రజలతో కలుగొల్పుగా, లౌక్యంగా వ్యవహరించే నాగేశ్వరరావు పోలీస్ శాఖలో ఉద్యోగ నిర్వహణలో మంచి సమర్ధుడుగా పేరు పొందారు. ఆపదలో ఉన్నవారికి సాయంగా నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సమస్యల పట్ల తక్షణమే స్పందించడం, పారదర్శకంగా, రాగ ద్వేషాల కతీతంగా పనిచేయడంలో ఆయన మేటి... కచ్చితత్వాన్ని పాటించడం నిక్కచ్చిగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి.