కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు...

కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు...

ముద్ర,తెలంగాణ:- నాలుగు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అటవీప్రాంతాల్లో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో దండకారణ్యా్లో గత కొంతకాలంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.