ఇంటింటికీ సి పి ఐ

ఇంటింటికీ సి పి ఐ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో  శనివారం ' ఇంటింటికీ సీపిఐ' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు.