విద్యార్థిని చితకబాదిన పిఈటి...

విద్యార్థిని చితకబాదిన పిఈటి...

ముద్ర,ధర్మపురి;ధర్మపురి మండలం లోని మగ్గిడి గ్రామంలోని ఎస్సి  గురుకుల పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న సందీప్ అనే విద్యార్థిని పిఈటి సురేష్ మంగళవారం చితకబాదగా విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్లగా తల్లిదండ్రులు వచ్చి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చితకబాదిన విషయం పై ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజమని ని వివరణ కోరగా విద్యార్థి వద్ద పాఠశాల కు అనుమతి లేని పెన్ డ్రైవ్ లభించడంతో పిఈటి చితకబాదినట్లు తెలిపారు. పిఈటి విధుల నుండి తొలగించినట్లు ఆమె తెలిపారు