రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

గుజరాత్ తీరంలో ఇరాన్ పడవ కలకలం సృష్టించింది. భారత్‌ తీరంలో ఇరానీ బోటు కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ బోట్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. సోదాలు చేయగా రూ.425 కోట్ల విలువైన 61 కిలోల మాదకద్రవ్యాలతో పాటు ఐదుగురు సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది.  ఏటీఎస్​ గుజరాత్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ సహకారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్  రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌ను తీసుకెళ్తున్న ఇరాన్‌ బోటును పట్టుకున్నారు. ఈ బోటులో ఐదుగురు వ్యక్తులు  ఉన్నారు.  పడవలోని సిబ్బందితో పాటు, పడవను కూడా అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.