చల్లని కబురు

చల్లని కబురు

 

  • 48 గంటల్లో కేరళకు 
  • నైరుతి రాక
  • తర్వాత దేశమంతటా విస్తరణ 
  • ప్రకటించిన ఐఎండీ  

న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది.  మరో 48 గంటల్లో నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది.  మరో రెండు రోజుల్లో దక్షిణాదిలో వర్షాలు కురుస్తాయనే సంకేతాన్ని ఇచ్చింది. తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు మాన్‌సూన్‌ విస్తరించనుంది. ఏప్రిల్‌ పూర్తిగా, మే నెల మొదటి వారంలో ఎండలు పెద్దగా లేకపోయినా తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరిగింది. మే ఆఖరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు నిత్యం 40 డిగ్రీల కంటే పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలకరి పలకరించనుందంటూ ఐఎండీ తీపి కబురు చెప్పింది.