మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముద్ర ప్రతినిధి, మెదక్: మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్దక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మెదక్ గో సముద్రంలో ఆదివారం ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జెడ్పి ఛైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ లతో  కలిసి విడుదల చేశారు. అనంతరం మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు గుర్తింపు కార్డులను అందజేసి వృత్తి గౌరవాన్ని మరింత పెంచిన ఘనత తెలంగాణ  ప్రభుత్వానిదే అన్నారు. నూతనంగా లక్ష మంది అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మత్స్య శాఖ జిల్లా అధికారి రజని తదితరులు పాల్గొన్నారు. అనంతరం మినీ ట్యాం