ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

 ఆత్మకుర్ (ఎం) ముద్ర : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెన్నార్ గార్డెన్స్ రచ్చ దయానందం ప్రాంగణంలో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో అంతరాలను పెంచి పోషించేలా వివిధ రకాల పాఠశాల ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ విద్యా రంగానికి ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ బడి లేకుంటే సామాజిక అంతరాలు పెరిగి సమాజ విచ్చిన్నానికి దారితీస్తాయని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు ఆటంకంగా ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీలను పాఠశాల అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని కోరారు. టీఎస్ యుటిఎఫ్ మొదటినుండి ఉపాధ్యాయ సమస్యల పట్ల నిక్కచ్చిగా పోరాడుతుందని నేడు ఉపాధ్యాయులు పొందుతున్న అనేక సౌకర్యాలు టీఎస్ యుటిఎఫ్ పోరాటాల ఫలితమేనని గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుండి గత పది సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు కృషి చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానం 20-20 శాస్త్రీయ విద్యను దూరం చేసి అశాస్త్రీయతను పెంపొందించేలా ఉన్నదని వెంటనే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముందుగా టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు వారాల యాదగిరి ఎస్ టి ఎఫ్ ఐ జెండా ఆవిష్కరించగా మరొక సీనియర్ నాయకులు దడిపెల్లి వెంకన్న టీఎస్ యుటిఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  దివంగత నాయకులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ ,ఎం ఏ కే దత్ ,రచ్చ దయానందం చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మిరియాల దామోదర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, జి.నాగమణి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్ రెడ్డి, ముక్కెర్ల యాదయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య,  నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్   జిల్లా ఉపాధ్యక్షులు ఏ వెంకటాచారి, జిల్లా కోశాధికారి ఇటికాల మల్లేశం, ముక్కెర్ల లక్ష్మి, సంగు వనిత, కార్యదర్శులు దొడ్డి స్వామి, కె రాజగోపాల్, బి ముత్యాలు, సుధర్మారెడ్డి, కె శ్రీనివాస్, పి వెంకట్ రెడ్డి, కంచి రవికుమార్, కే మమత, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ కట్ట రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఎస్ అనిల్ కుమార్, ఆత్మకూరు, మోత్కూరు, గుండాల మండలాల బాధ్యులు దర్శనం వెంకన్న, ఏ సత్తయ్య, గుండు జగన్, టీ ఉప్పలయ్య  పాల్గొన్నారు.