భారీగా నగదు సీజ్

భారీగా నగదు సీజ్

ముద్ర ప్రతినిధి , కోదాడ : కోదాడ పట్టణంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నగదును పట్టుకున్నారు.  మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో హుజూర్ నగర్ రోడ్డులోని ఫ్లయిఓవర్ వద్ద వెళుతున్న కారులో పది లక్షల రూపాయల సరైన పత్రాలు లేని నగదును సీజ్ చేసినట్లు పట్టణ ఇన్సపెక్టర్ టి. రాము తెలిపారు . హుజూర్ నగర్ మండలం మాధవరాయని గూడెం కు చెందిన కందుల. వినయ్ అనే వస్త్ర యజమాని హుజూర్ నగర్ వెళుతుండగా ఎస్సై యాదవేందర్ రెడ్డి సిబ్బందితో చెక్ చేసి సీజ్ చేసినట్లు తెలిపారు .