గ్రేటర్ హైదరాబాద్ పై చంద్రబాబు నాయుడు అభివృద్ధి ముద్ర చేదరనిది

గ్రేటర్ హైదరాబాద్ పై చంద్రబాబు నాయుడు అభివృద్ధి ముద్ర చేదరనిది

ఈ నెల 23 నుండి నిర్వహించే టీటీడీపీ బస్సుయాత్ర విజయవంతం చెయ్యాలి, గ్రేటర్ పరిధిలో ఉన్న పార్లమెంట్,అసెంబ్లీ నియోజక వర్గాలలోని ముఖ్య నాయకుల సమావేశంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి. గ్రేటర్ పై చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ముద్ర ఎప్పటికీ చేదిరిపోదని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ నెల 23 నుండి నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ బస్సు యాత్ర విజయవంతంపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్య నాయకులతో కాసాని జ్ఞానేశ్వర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ. తెలుగుదేశం బస్సుయాత్ర జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు సలహాలు,సూచనలతో ఆయన చేతుల మీదుగా ఈ బస్సు యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ యాత్రలో చంద్రబాబు పాల్గొంటారని, పార్టీ కేడర్ పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు.

కృష్ణ- గోదావరి జలాలను తాగునీటి కోసం హైదరాబాద్ కు తరలించి నీటి దాహార్తి తీర్చరని, హైటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణం ద్వారా ఐటి రంగంలో లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారని జ్ఞానేశ్వర్ కితాబిచ్చారు. నాడు టీడీపీ పాలనలో హైదరాబాద్ తో సహా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్ర ద్వారా తెలుగుదేశం సత్తా చాటాలని పార్టీ కేడర్కు పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమని, ఇదే లక్ష్యంతో చేపడుతున్న బస్సు యాత్రను విజయవంతం అయ్యేలా పార్టీకి చెందిన పార్లమెంట్ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులపై గురుతర బాధ్యత ఉందన్నారు. అన్ని స్థాయిల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ,జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జక్కిని ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్, వెంకటేష్, ఆరిఫ్, జీవిజీ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీనివాస్ నాయడు,రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శులు ..బిక్షపతి ముదిరాజ్, మందురి సాంబశివ రావు, రవీంద్ర చారి,మల్కాజగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా, హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆలీ మస్కతీ,రాష్ట్ర తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్,రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.