మణిపూర్​ ఘటన

మణిపూర్​ ఘటన
  • నిందితులను కాల్చి పారేయాలి
  • కాంగ్రెస్​ జామ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్​ అన్సారీ

జార్ఖండ్​: మణిపూర్​ హింసపై జార్ఖండ్​కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఇర్ఫాన్​ అన్సారీ మాట్లాడుతూ.. ఇలాంటి హింసను సహించేది లేదన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని కోర్టుకు తరలించడం, విచారించడం కూడా అనవసరమన్నారు. నేరుగా కాల్చి పారేయాలన్నారు. అప్పుడు గిరిజనులపై దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. మణిపూర్‌లో గిరిజన సోదరీమణులపై జరిగిన హింసాత్మక ఘటన విచారకరమన్నారు. గిరిజన తల్లులు, సోదరీమణులపై జరిగిన ఆకృత్యాలను ఎవ్వరూ సహించవద్దన్నారు. దేశంలో గిరిజనులపై అఘాయిత్యాలు ఇంకా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడెక్కడో తలపై మూత్రం పోసి, ఎక్కడో గిరిజన సోదరీమణులను వివస్త్రగా ఊరేగిస్తున్నారు. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆదివాసీ నాయకులు మౌనంగా ఎందుకు కూర్చున్నారని నిలదీశారు. కాగా జార్ఖండ్ కాంగ్రెస్‌కు చెందిన జమ్తారా ఎమ్మెల్యేకు వివాదాలతో పాత అనుబంధం ఉంది. ఆయన బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. జూన్ 10, 2022 న, అతను రాజధాని రాంచీలోని ప్రధాన రహదారిపై ఆందోళన, హింసాత్మక ఘర్షణలో మరణించిన యువకులకు అమరవీరుని హోదాను డిమాండ్ చేశాడు. 2022లో తన అసెంబ్లీ నియోజకవర్గం జమ్తారాలోని ఒక రహదారిని ప్రస్తావిస్తూ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెంపల కంటే ఈ రోడ్లను సున్నితంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతే కాదు సైబర్ ఫ్రాడ్‌గా పేరు తెచ్చుకున్న జమ్తారాను ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ విజ్ఞాన ప్రదేశమని పిలిచారు.