వైద్యసేవల పరంగా మానుకోట మరింత అభివృద్ది.. మంత్రి సత్యవతిరాథోడ్ 

వైద్యసేవల పరంగా మానుకోట మరింత అభివృద్ది.. మంత్రి సత్యవతిరాథోడ్ 

ముద్రప్రతినిధి మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో 134 రకాల పాథాలజీ పరీక్షలు అప్గ్రేడేషన్ చేస్తూ డయాగ్నోస్టిక్స్ ను రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా జడ్పి చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి శనివారం ప్రారంభించారు.
అనంతరం హైదరాబాద్ నుండి  మంత్రి హరీశ్ రావు వర్చువల్ మోడ్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ నుండి మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. వైద్యుల దినోత్సవ సందర్భంగా నర్సులకు హ్యాండ్ బ్యాగులను అందజేశారు మంత్రిసత్యవతిరాథోడ్.వర్చువల్ మోడ్ లో మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ..

మహబూబాబాద్ జిల్లాలో రెండు కోట్లతో డయాగ్నోస్టిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేసి  నిరుపేదలకు వైద్యం మరింత చెరువ చేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కి కృతజ్ఞతలు. తెలియజేస్తున్నా అని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు కోసం వెళితే ప్రైవేట్ ల్యాబ్ లకు రాసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉంటున్నది. ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, డీఎంహెచ్ఓ హరీష్ రాజ్, ఆస్పత్రి సూపరిటెండెంట్, శ్రీనివాసరావు, డాక్టర్ సీతామహాలక్ష్మి,  సిబ్బంది వైద్యులు తదితరులు పాల్గొన్నారు.