కిట్ లు ఇచ్చి టెన్ని కాయిట్ ఆడిన మంత్రి

కిట్ లు ఇచ్చి టెన్ని కాయిట్ ఆడిన మంత్రి
  • ఉల్లాసంగా....ఉత్సాహాంగా      
  •  అబాల గోపాలంతో క్రీడా వినోదం పంచుకుని
  • చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే  సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్  రెడ్డి ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు.

వేసవి విడిదిలో చిన్నారుల్లో క్రీడా స్పూర్తి పెంపొందించేందుకు గాను క్రీడా సామాగ్రి అందజేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి .ఓ శుభకార్యం నిమిత్తం పెన్ పహాడ్ మండలం నాగులపహాడ్ కు వెళ్లారు. అక్కడి నుండి వెనుదిరిగే క్రమం లో  మంత్రి  ని చూసిన పిల్లలు ఫోటో ల కోసం ఎగబడ్డారు..  వెంటనే ఆగిన మంత్రి వేసవి లో ఏమి ఆటలు ఆడుతున్నారంటూ పిల్లల ను అడిగి తెలుసుకున్నారు.. అట వస్తువులు కావాలంటూ పిల్లలు కోరిన వెంటనే, క్రీడా సామాగ్రి అందజేసిన మంత్రి, వారితో కలిసి సరదాగా కాసేపు టెన్నికాయిట్ (రింగ్ బాల్) ఆడి ఉత్సహా పరిచారు. మంత్రి పిల్లల తో కలిసి  పోయి,అడటం చూసిన పెద్దలు ఆశ్చ్యరపోగా, పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.