మొసలి కన్నీరు కార్చడం కాదు..

మొసలి కన్నీరు కార్చడం కాదు..
MLC Jeevan Reddy

పెరిగిన సిలిండర్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్యాస్ ధర పెరగడంఫై బిఆర్ఎస్ ప్రబుత్వం మొసలి కన్నీరు కార్చడం కాదు..పెరిగిన సిలిండర్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ...రాష్ట్ర ప్రభుత్వం ఎన్ డీ ఏ ప్రభుత్వం పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే..కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై మేము కూడా బీ ఆర్ ఎస్ తో కలిసి వస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాలు విసిరారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి సిలిండర్ పై రు.50 పెంచి నిరుపేదల పై భారం మోపడమెనా ప్రధాని  సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. బీ ఆర్ ఎస్ బీజేపీ ఒకరినొకరు విమర్శించుకోవడం మినహా చేసింది ఏమి లేదని, బీజేపీ ప్రజల కోసం ఏమైనా చేసిందా..చెప్పుకోవడానికి..ప్రజల్లోకి ఎలా వెళ్తారని నిలదీశారు. వంట గ్యాస్ ధర 220 శాతం పెంచారని యూపీఏ పాలనలో కేంద్రం రు.50 ధర పెంచితే రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేద ఆడ బిడ్డలపై భారం పడకుండా పెంచిన ధర భారం రు.50 రాష్ట్ర ప్రభుత్వమే భరించింది అని గుర్తు చేశారు.

మొసలి కన్నీరు కార్చకుండ చిత్తశుద్ది ఉంటే  నిరుపేద ల పై రు.50 భారం పడకుండా ప్రభుత్వమే భరించాలన్నారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ పాలన లోని ప్రభుత్వం రు.500 లకే సిలిండర్ ఇస్తోందని, అవసరమైతే అక్కడికి వెళ్లి పరిశీలించాలని అని అన్నారు. జగిత్యాల పట్టణం లో నేటి నుంచి హాథ్ సే హాథ్ జో డో చేపట్టనున్నామని, రాహుల్ గాంధీ భారత్ జో డో యాత్ర కు అనుబంధంగా హాథ్ సే హాథ్ జో డో చేపట్టామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తోపాటు, కాంగ్రెస్ పాలన లో చేపట్టిన పథకాలు వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు గిరి నాగ భూషణం, పిసిసి ఆర్గనైజేషన్ సెక్రెటరీ బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేప ల్లి దుర్గయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ పులి రాము పుప్పాల అశోక్ రమేష్ రావు బింగి రవి, కోర్టు శ్రీను,  దయ్యాల శంకర్, పిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ చాంద్ పాషా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మహిపాల్, రాజేష్,విజయ్, రజనీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.