బ్యాంకుల నుండి రైతులకు నోటీసులు!

బ్యాంకుల నుండి రైతులకు నోటీసులు!
  • రుణమాఫీ కాక రైతులకు తిప్పలు
  • లోన్లు చెల్లించాలని బ్యాంక్ అధికారుల తీవ్ర ఒత్తిడి

చిట్యాల ముద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు, నుండి రైతులు గతంలో తీసుకున్న రుణాలు కట్టాలని బ్యాంకుల నుండి నోటీసులు పంపుతూ అధికారులు ఇండ్ల వద్దకు వచ్చి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రుణాలు కట్టకుండా బ్యాంకుల వైపు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో అప్పులు అధిక వడ్డీతో అధికంగా రుణాలు పెరిగి రైతులకు భారంగా మారాయి. ప్రస్తుతం బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలని రైతులకు నోటీసులపై నోటీసులు రైతులకు అందిస్తూ ఆ యొక్క నోటీసుల ఖర్చులను కూడా రైతుల ఖాతాకు జమ చేస్తూ రైతుల రుణాలను అధిక వడ్డీలతో పెనుబారం చేస్తున్నారు.

ప్రభుత్వం లక్ష వరకు రుణమాఫీ చేయక రైతులకు ఆశ చూపి కేవలం 35 వేల రుణాలను మాత్రమే మాఫీ చేసినట్టు ప్రకటించి రుణాలపై ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఉండడంతో రైతుల రుణాలు పెరిగి రైతులకు భారంగా మారుతున్నాయి. గతంలో రుణాలను సక్రమంగా బ్యాంకులకు చెల్లించిన వారికి రుణమాఫీ కాకపోవడంతో గతంలో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ కావడంతో రైతులు బ్యాంకులకు రుణాలు కట్టడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం లక్ష వరకు రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేదా బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జాతి చేసి రైతులపై ఒత్తిడి లేకుండా ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.