చిత్రపురి కాలనీ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

చిత్రపురి కాలనీ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్ ఘాట్: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ తనయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ కుమార్తె ఎన్‌.భువనేశ్వరి, మనవడు, కల్యాణ్‌రామ్‌, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చిత్రపురి కాలనీ:ఎన్టీఆర్ 100 వ(శత) జయంతి సందర్బంగా చిత్రపూరి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నటుడు మురళి మోహన్, పరుచూరి గోపాలకృష్ణ, ఎండీ కే. సత్యనారాయణ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విరహావిష్కరణ జరిగింది. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆదర్శనీయుడని, యుగపురుషుడని అన్నారు.

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మహనీయులని కొనియాడారు. చరిత్రలో ఎన్నటికీ మరువలేని మహామనిషి అని చెప్పారు. తెలుగుజాతి గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటిన గొప్ప నేత ఎన్టీఆర్‌ తెలిపారు. ఆయన శతజయంతిని నేడు ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.