సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు భేష్

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు భేష్

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: భూసారం పెరిగేందుకు అవలంబిస్తున్న యాజమాన్య పద్ధతులు కేశవపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు భేష్ గా ఉన్నాయని బీసీఐ ప్రాజెక్టు ఇంగ్లాండ్ ప్రతినిధి ఏంజిల్ రోస్ అన్నారు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని బిసిఐ కార్యాలయాన్ని సందర్శించి  నిర్వహిస్తున్న ప్రాజెక్టు కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతినిధి ఏంజిల్ రోస్ మాట్లాడుతూ పర్యావరణానికి వినాశనం రసాయనిక పురుగు మందుల వల్లనే జరుగుతుందని, భూసారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించాలని అన్నారు. అనంతరం డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ పుల్లూరి వంశీకృష్ణ మాట్లాడుతూ రాబోయే తరాలకు మంచినేల అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, రైతులందరూ సహకరించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా పలు పద్ధతులను ఆచరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఇండియా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి సతీష్, ఎస్ ఎల్ ఎం ప్రాజెక్ట్ మేనేజర్ టి సతీష్, కాల్వ శ్రీరాంపూర్ పి యు మేనేజర్ సాయి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.