తిమ్మాపూర్ లో చెరువుకు గండి

తిమ్మాపూర్ లో చెరువుకు గండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామ చెరువుకు బుధవారం గండి పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి చేరుతున్న నీటి కారణంగా ఈ గండి పడింది. దీంతో చెరువు కింది పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతాంగం కోరారు.