బిజెపి అభ్యర్థికి యువజన సంఘాల సంఘీభావం

బిజెపి అభ్యర్థికి యువజన సంఘాల సంఘీభావం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి యువజన సంఘాల వారి మద్దతు పెరుగుతోంది.సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామ ఛత్రపతి శివాజీ యూత్, యువ స్టార్ యూత్, జై శ్రీరామ్ యూత్, గంగపుత్ర యూత్, శివసేన యూత్, పాల సంఘం సభ్యులు , రైతు నాయకులు పతాని సుభాష్ తో పాటు పలువురు అధికార పార్టి ముఖ్య నాయకులు మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామానికి చెందిన అధికార పార్టీ సీనియర్ నాయకులు, పి ఎ సి ఎస్ డైరెక్టర్ దాసరి రమణయ్య తో పాటు పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ లో చేరారు. నిర్మల్ పట్టణం మంజులాపూర్ కు చెందిన శ్రీరాం యూత్ సభ్యులు ఏలేటి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.