Palm Baskets in TTD తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల్లో తాటాకు బుట్టలు

Palm Baskets in TTD తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల్లో తాటాకు బుట్టలు
Palm Baskets in TTD

ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయ వృత్తులకు చేయూత అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది.

ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో ఈ బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది టీటీడీ. త్వరలో ఈ బుట్టలను తక్కువ ధరకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.