జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా  మూడేళ్ల నుండి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ వారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి మూడేళ్లుగా తాము గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నామని వివరించారు. తమ శ్రమను గుర్తించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు.