ఉరూర బలగం ప్రదర్శన... కన్నీరు మున్నీరైన కుర్తివాడ

ఉరూర బలగం ప్రదర్శన... కన్నీరు మున్నీరైన కుర్తివాడ

ముద్ర ప్రతినిధి, మెదక్: ఊరు, వాడల్లో బలగం సినిమా ప్రదర్శన బంధాలను కలుపుతోంది... కుటుంబ అనుబంధాలను గుర్తు చేస్తోంది. బలగం సినిమాను ఉరూర ప్రదర్షిస్తున్నారు. గతించిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఎల్ఈడి ఏర్పాటు చేసి సినిమా చూపిస్తున్నారు. వృద్ధ మహిళలు సినిమా చూస్తూ కన్నీటి పర్యంతమావుతూ తమ కుటుంబ అనుబందాలను నెమరువేసుకుంటున్నారు. 
పాపన్నపేట మండలం కుర్తివాడలో బలగం సినిమాను ప్రదర్శించారు. గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రభులింగం మడపతి రామమ్మ, మడపతి ప్రశాంత్ కుమార్ జ్ఞాపకార్థం ఎల్ ఈడి ఏర్పాటు చేయించగా గ్రామస్థులు పెద్దఎత్తున కూర్చుంది వీక్షించారు. పాత రోజులను నెమరువేసుకున్నారు.