కాంగ్రెస్ లో చేరిన రామో జీపేట యువకులు..

కాంగ్రెస్ లో చేరిన రామో జీపేట యువకులు..

ముద్ర, రాయికల్ : రాయికల్ మండలం రామోజీ పేట గ్రామానికి చెందిన 20 మంది యువకులు కాంగ్రెస్  పార్టీలో చేరారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీజీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరిన యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. యువకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ విజయం కోసం పని చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుఖాయమని జీవనరెడ్డి అన్నారు.