తండ్రి విజయాన్ని కాంక్షిస్తూ తనయుడు ఎన్నికల ప్రచారం

తండ్రి విజయాన్ని కాంక్షిస్తూ తనయుడు ఎన్నికల ప్రచారం

మునగాలముద్ర: మునగాల మండల కేంద్రంలోని కోదాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారుడు బొల్లం కళ్యాణ్ యాదవ్  స్థానిక శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయములో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ మల్లయ్య యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోగరు రమేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉడుం కృష్ణ సర్పంచ్ చింతకాయల ఉపేందర్ చైర్మన్ సీతారాములు ఎల్పి రామయ్య వెంకన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.